
అక్రమంగా ఎర్రమట్టి తరలింపు
చిన్నచింతకుంట: మండలంలోని పల్లమరి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట నుంచి కొందరు ఎలాంటి అనుమతుల్లేకుండా ఎర్రమట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఆదివారం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే టిప్పర్లు, ట్రాక్టర్లు వెళ్లిపోయాయి. అక్కడే ఉన్న హిటాచీ డ్రైవర్ భరత్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సోమవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు. అక్రమార్కులు పగలు ఎర్రమట్టిని తరలిస్తూ రాత్రి సమయంలో గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగునుంచి ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అకాల వర్షానికి నేలరాలిన మామిడి కాయలు
పెద్దకొత్తపల్లి : మండలంలో అదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మామిడి కాయలు నేలరాలినట్లు కౌలురైతులు తెలిపారు. మండలంలో సుమారు 1000 ఎకరాల్లో మామిడి కాయలు నేలపాలయ్యాయి. కల్వకోలు, తీరునాంపలి, చెన్నపురావు పల్లి, జోన్నలబోగుడ, పెద్దకొత్లపల్లి దేవుని తిరుమలాపూర్ ,చంద్రకల్, ముష్టిపల్లి, మరికల్ మామిడి తోటల్లో కాయలు వర్షానికి రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.

అక్రమంగా ఎర్రమట్టి తరలింపు