చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Published Mon, Apr 7 2025 12:22 AM | Last Updated on Mon, Apr 7 2025 12:22 AM

చేపల

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

నవాబుపేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కాకర్లపహాడ్‌లో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మరిపల్లి కేశవులు(47) అనే వ్యక్తి శనివారం గ్రామ సమీపంలోని ఉంగరం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు చెరువులో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం అతడు చెరువులో శవమై కనిపించాడు. మృతుడి కుమారుడు వెంకటేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ..

ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్‌ పాఠశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌడపోళ్ల అంజమ్మ(45) చికిత్స పొందుతూ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరికల్‌ మండలానికి చెందిన అంజమ్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై వస్తుండగా ధన్వాడలోని మోడల్‌ పాఠశాల సమీపంలో ఎదురుగా ఇంకో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక అంజమ్మ ఆదివారం సుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిందని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

మురుగు కాల్వలో పడి యువకుడు..

కోడేరు: మురుగు కాల్వలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హరిజన మిద్దె మహేష్‌(18) ఆదివారం ఉదయం బయటికెళ్తుండగా పక్కన ఉన్న మురుగు కాల్వలో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

పేకాట రాయుళ్ల అరెస్టు

కల్వకుర్తి టౌన్‌: పట్టణంలోని హానుమాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేకాటాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లుగా ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపా రు. వివరాలు.. పట్టణంలోని హానుమాన్‌ నగర్‌లోని ఓ వ్యక్తి ఆదివారం ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందింది. తనిఖీలు చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.96,250 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, పేక ముక్కలను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహరం

పాన్‌గల్‌: ప్రేమ వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరిన ఘటన ఆదివారం రాత్రి పాన్‌గల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రేమద్దులకు చెందిన నందిని(22), మహేందర్‌(29) ఇరువురు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటన్నారు. అమ్మాయి హైదరాబాదులో ఫామ్‌–డి చదువుతుండటం, అబ్బాయి డిగ్రీ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. ఇరువురు కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదు. శనివారం అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను, గ్రామ పెద్దలను స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. పోలీసులు, పెద్దల సమక్షంలో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం చూసి అందరి సమక్షంలో కొల్లాపూర్‌ సమీపంలో సింగోటం దేవాలయంలో పెళ్లికి చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి  
1
1/1

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement