
జోరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం ఈశ్వర వీరప్పయ్యస్వామి రథోత్సవం ఉండటంతో మార్కెట్‌కు సెలవు ప్రకటించగా.. ఒకరోజు ముందుగానే ఉల్లి వేలం నిర్వహించారు. సుమారు మూడు వేల బస్తాల ఉల్లి మార్కెట్‌కు రాగా.. నాణ్యమైన ఉల్లి ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఉల్లిని తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేశారు.
నిలకడగా ధరలు..
మంగళవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. ఉదయం 10 గంటలకే వేలం ప్రారంభం కాగా క్వింటా గరిష్టంగా రూ.1,800.. కనిష్టంగా రూ.1,200 ధర పలికింది. మార్కెట్ నిబంధనలు సడలించిన తర్వాత బస్తా 50 కిలోలుగా నిర్ణయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.900.. కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు.
క్వింటా గరిష్టంగా రూ.1,800..
కనిష్టంగా రూ.1,200