
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
మెట్టుగడ్డ: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కార్యాలయాల్లో మాత్రమే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.
గంటల తరబడి నిరీక్షణకు ముగింపు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలు గంటల తరబడి వేచి యుండే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో ఉదయం వస్తే సాయంత్రంకు కూడా డాక్యుమెంట్ ప్రక్రియ కొనసాగుతుండేది. ఇందులో భాగంగానే దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా పూర్తయ్యేందుకు ఈ స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకవస్తుంది. ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఒక్క దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు 10నుంచి 15 నిమిషాలలో పూర్తయ్యేలా ఈ కొత్త విధానంలో తేనున్నారు. కొన్ని కార్యాలయాల్లో 80 నుండి 100 దస్తావేజులు వచ్చేవి. దీనితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకొడిగా సాగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొందరు దళారులను ఆశ్రయించి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునేవారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రతి కార్యాలయంలో పని వేళల్లో 48 స్లాట్స్‌గా విభజించారు. రోజుకు కేవలం 48 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగేలా అందుబాటులోకి తేనున్నారు.
ప్రజలే దస్తావేజులను తయారు
చేసుకునేలా మాడ్యుల్
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు మధ్యవర్తులపై, దస్తావేజు లేఖరులపై, ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్‌సైట్ లో ఒక మాడ్యుల్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం సేల్‌డీడ్ దస్తావేజులు మాత్రమే చేసుకునేలా అవకాశం కల్పించారు.
నూతన విధానానికి శ్రీకారం
స్లాట్ బుకింగ్‌తో ప్రజలకు మేలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ సేవలతో ప్రజలకు మేలు జరుగుతుంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా కానుంది. ప్రజలు మధ్యవర్తులు, దస్తావేజు లేఖరులపై ఆధారపడకుండా స్వంతంగా దస్తావేజులు తయారు చేసుకునేలా మాడ్యు ల్ కూడా అందుబాటులోకి వచ్చింది..
– మొహమ్మద్ హమీద్,
జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1,
మహబూబ్‌నగర్
రోజుకు 48 మాత్రమే
ప్రజలకు మరింత సులువుగా,
వేగవంతంగా
10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు ఎంపిక
నేటి నుంచి ప్రారంభం
స్లాట్ బుకింగ్ విధానం ఇలా
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకొని, ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్లాట్ బుక్ చేసుకొని వారి కోసం ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు జరిపేలా, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరించేలా మరో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు.

రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్

రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్