
టూరిజం స్పాట్‌గా వానగట్టు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: త్వరలో స్థానిక నవాబుపేట రోడ్డులోని వానగట్టు టూరిజం స్పాట్ గా మారనుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న సు మారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక, అటవీ, మున్సిపల్ కార్పొరేషన్ శాఖల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం శివారులో పిల్లలమర్రి, మయూరి పార్కు, మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం తదితర ప్రాంతాలు టూరిజం స్పాట్‌గా కొనసాగుతున్నాయి. తాజాగా వానగట్టు సైతం చేరింది. ఇది ఎత్తయిన ప్రదేశం కావడంతో నగరం మొత్తం ఇక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉండేందుకు విరివిగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేశారు. కాగా, ఇప్పటికే అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించి మయూరి నర్సరీ ఆవరణలో వ్యూ పాయింట్ ఉంది. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
వ్యూ పాయింట్ కోసం స్థల పరిశీలన
3 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు