
ఫుట్‌బాల్ టోర్నీ చాంపియన్ విశాఖపట్నం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించిన ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా విశాఖపట్నం జట్టు నిలిచింది. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొనగా రాబిన్ రౌండ్ లీగ్ పద్దతిలో ఆరు మ్యాచ్‌లు నిర్వహించారు. విశాఖపట్నం జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొంది 9 పాయింట్లు సాధించి విన్నర్‌గా, నెల్లూర్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు 3 పాయింట్లు దక్కించుకొని తృతీయస్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ జట్టు 2–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల జట్టుపై, విశాఖపట్నం జట్టు 1–0 గోల్ తేడాతో నెల్లూర్ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి.
ట్రోఫీలు అందజేసిన ఎన్‌పీ వెంకటేశ్
ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో విన్నర్ విశాఖపట్నం జట్టు, రన్నరప్ నెల్లూర్ జట్లకు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్‌పీ.వెంకటేశ్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో నాలుగు జట్లు పాల్గొని తమ ప్రతిభచాటడం అభినందనీయమని అన్నారు. ఈ వయస్సులో కూడా సీనియర్ క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆటపై తమనకున్న అభిమానంతో ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, శంకర్‌లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇమ్మాన్యుయెల్ జేమ్స్, గజానంద్‌కుమార్, నందకిషోర్, రామేశ్వర్, నగేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.
రన్నరప్‌గా నిలిచిన నెల్లూరు జట్టు
ముగిసిన ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్