చెన్నూర్‌రూరల్: మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి సంపత్(25) చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూర్ పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.... ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి సంపత్ ఈ నెల 26వ తేదీన రాత్రి అదే గ్రామంలోని కిరాణ షాపుకు కోడిగుడ్లు కొనేందుకు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన వీరబోయిన సతీశ్, పంది మహేశ్, అలుగునూరి అరుణ్ అనే వ్యక్తులు షాపు వద్దే ఉన్నారు.
వాళ్లు సంపత్‌తో మాట్లాడుతుండగా సతీష్ సంపత్‌ను అవురా అని అన్నాడు. కులం తక్కువ వాడివి అలా అంటావా అని సతీష్, మహేష్, అరుణ్ సంపత్‌ను కడుపుపై గుద్దారు. దీంతో ఇంటికి వెళ్లిన సంపత్‌కు నొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ సంపత్‌కు శుక్రవారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో చెన్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జైపూర్ ఏసీపీ మోహన్ పరిశీలించారు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నతుట్ల సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment