కాలం పగబట్టింది రా కన్నా... ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదురా బిడ్డ క్షమించు రా నాన్నా..! ఏ లోకంలో ఉన్నా.. ఈ అమ్మ ప్రాణం నీకోసమే..
మంచిర్యాల: మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక (28) విద్యుత్‌షాక్‌తో బుధవారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వాటర్‌ట్యాంక్‌లో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కింది. అయితే తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. వాటిని తాకిన మౌనికకు విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి జాడి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే..
మౌనిక తల్లి రెండేళ్ల కిందట మృతి చెందింది. ఇంట్లో పనులు చేసేందుకు మూడు రోజుల కిందట ముత్యంపల్లిలోని తల్లిగారి నివాసానికి మౌనిక వెళ్లింది. బుధవారం శ్రీరామ నవమి కావడంతో ఉదయాన్నే అత్తగారి ఇంట్లో మౌనికను తండ్రి దింపివేసి వెళ్లారు. కొద్దిగంటల్లోనే కుమార్తె మరణ వార్త రావడంతో తండ్రి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఆమెకు భర్త రాజేశ్, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment