
కాగజ్‌నగర్‌రూరల్: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నెం.2 గ్రామానికి చెందిన గులాల్ సర్కార్ (44) కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గులాల్ సర్కార్ మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం కూడా దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య సరస్వతి క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి కమలా సర్కార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్‌రూరల్ సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్సై సందీప్ పరిశీలించారు.