పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి
పాతమంచిర్యాల: ఈ నెల 25నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీ రి జర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని, 50శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీని వాస్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి మోదీకి లేఖ పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన వా టా రాకుండా ఎన్నాళ్లు దాట వేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అమలు కు అనుకూలంగా రాజకీయ పార్టీలు తీర్మానా లు చేసి పంపించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ హక్కు ల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు కర్రె లచ్చన్న, రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్, నాయకులు భీంసేన్, ఆరెందుల రాజేశం, అంకం సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment