కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య
గుడిహత్నూర్: కడుపునొప్పి భరించలేక బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై కె.మహేందర్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..మండలంలోని సూర్యగూడ గ్రామానికి చెందిన బాలిక గెడం వేదిక (15) కొన్నినెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చూయించినా తగ్గలేదు. సోమవారం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి తండ్రి సునీల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై యువకుడు..
కడెం: మద్యానికి బానిసై యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఆదిలాబాద్ మండలం తిప్ప గ్రామానికి చెందిన ఆత్రం నైకు(24) మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యానికి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వకపోవడంతో బైక్‌పై బయల్దేరాడు. సోమవారం కడెం మండలం ఉడుంపూర్ శివారు ఆటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడ చెట్టుకు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్రం రాము ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బేలలో యువకుడు
బేల: మండలంలోని సదల్‌పూర్ రెవెన్యూ గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దివ్యభారతి కథనం ప్రకారం..మండలంలోని షంషాబాద్‌కు చెందిన బెదుర్‌కార్ సుధీర్ (28)కి ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి ముహూర్తం తీసే క్రమంలో ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆందోళన చెందాడు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మహాదేవ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment