మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత
ఇచ్చోడ/బోథ్: మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు ఇచ్చోడ ఎకై ్సజ్ సీఐ జుల్ఫీకర్ అహ్మద్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో సోమవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సొనాల మండలంలోని ఘన్‌పూర్ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. బజార్‌హత్నూర్ మండలం దెగామ గ్రామానికి చెందిన చెవ్వ శ్రీనివాస్ బైక్‌పై వస్తున్నాడు. తనిఖీ చేయగా రూ.8,400 విలువ గల మద్యం లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకుని, బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఎవరైన మద్యం తీసుకువచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ సీఐ హెచ్చరించారు.
బైక్ చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కుమార్‌పేట్‌కు చెందిన సాయిప్రసాద్ ద్విచక్రవాహ నం చోరీకి గురైంది. ఆదివారం రాత్రి ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. సోమవారం ఉద యం చూసేసరికి కనిపించలేదు. దీంతో చు ట్టూపక్కల గాలించిన ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment