
ర్యాగింగ్ భూతం!
● వసతిగృహాల్లో తప్పిన క్రమశిక్షణ ● జిల్లాలో వరుస ఘటనలతో ఆందోళనలు ● ఆదిలోనే నిలువరించలేకపోతున్న వైనం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే వయస్సులో స్కూల్, కాలేజీ తేడా లేకుండా తరచూ ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. వసతిగృహాల్లో జరుగుతున్న తీరుతో తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, అధికారులు నివ్వెరపోవాల్సి వస్తోంది. తాజాగా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 8వ తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు సిగరేట్ తాగాలంటూ ర్యాగింగ్ చేయడం, ఆ విషయాన్ని బయటపెట్టినందుకు పదో తరగతి విద్యార్థిపైనా దాడి చేయడం కలకలం రేపింది. ఇక తల్లిదండ్రులు సైతం కాలేజీకే వచ్చి ఆ ఇంటర్ విద్యార్థులపై దాడి చేశారు. ఆదిలోనే నిలువరించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చే అవకాశమే లేకపోయేది. ఆ కాలేజీలో విద్యార్థులు, టీచర్ల మధ్య గతి తప్పిన క్రమశిక్షణను చెప్పకనే చెబుతోంది. మరోవైపు జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థుల గొడవలతో తల్లిదండ్రులు ఆందోళన కు గురవుతున్నారు. కొన్నిసార్లు సున్నిత మనస్తత్వం ఉన్న విద్యార్థులు హాస్టల్‌కే వెళ్లబోమంటూ మారాం చేస్తున్నారు. ఇక కొందరు విద్యార్థులు చా టుగా హాస్టల్ దాటి రాత్రివేళ బయట తిరగడాలు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, చెడు అలవాట్ల బారిన ప డుతున్నారు. సంబంధిత బాధ్యులు కఠినంగా వ్యవహరించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
వెలుగులోకి రానివెన్నో..
తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని తల్లిదండ్రులు వసతిగృహాల్లో చేర్చుతున్నారు. అక్కడ కొందరు ఆకతాయిలుగా మారిపోయి, మరికొంతమంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కలవపరుస్తోంది. అలాంటి వారిని ముందే పసిగట్టి హెచ్చరించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇబ్బందిగా మారుతోంది. కొందరు విద్యార్థులు అక్కడి టీచర్లనే బెదిరించే స్థాయిలో ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఎవరైనా అమాయకంగా ఉంటే వారిని లక్ష్యంగా చేసుకుంటూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. చాలాసా ర్లు ఈ ఘటనలు వెలుగులోకి రావడం లేదు. జిల్లాలో జరుగుతున్న ఘటనలు సైతం కొద్దిరోజులు గడిచాకే బయటకు వస్తున్నాయి. ఇలాంటివి ఆదిలోనే నిలువరించాల్సిన వసతిగృహా సిబ్బంది ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఘటన జరిగితేనే హడావుడి
వసతిగృహాల్లో ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావుడి చేయడం, మళ్లీ షరా మామూలే అన్నట్లుగా మారుతోంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం హాస్టళ్లలో రాత్రి వేళ విద్యార్థులతో నిద్ర చేస్తున్నారు. అయినా ఇలాంటి ఘటనలు జరగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. లోపం ఎక్కడ జరుగుతోందనే కోణంలో అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
గత సెప్టెంబర్‌లో బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో వీడ్కోలు పార్టీలో సెల్‌ఫోన్ విషయంపై జూనియర్, సీనియర్ల మధ్య గొడవ జరగడంతో ఆ విద్యార్థులపై వేటు వేశారు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీ సుస్టేషన్‌లో కేసు సైతం నమోదైంది.
చెన్నూరు మైనార్టీ గురుకులంలో ముగ్గురు వి ద్యార్థులు వసతిగృహంలో క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారని అధికారులు సస్పెండ్ చేశా రు.
గత నెల 8న చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై ఏ డుగురు తోటి విద్యార్థులే కాళ్లు నొక్కాలంటూ, డబ్బులు ఇవ్వాలంటూ దాడి చేస్తూ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు గు రుకులం ఎదుట ఆందోళన చేశారు. చివరకు ఆ విద్యార్థి స్కూల్‌కే వెళ్లను అంటూ తల్లిదండ్రులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు సస్పెండ్ చేయగా, ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు.

ర్యాగింగ్ భూతం!
Comments
Please login to add a commentAdd a comment