
బండి సంజయ్ దృష్టికి దాడి ఘటన
మంచిర్యాలటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున నస్పూర్ ఎస్సై బీజేపీ నాయకులపై ప్రవర్తించిన తీరు, పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడి ఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నాయకుడు కమలాకర్‌రావుపై ఎస్సై చేయి చేసుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు బీ జేపీ నాయకులపై రాళ్ల దాడి చేసినప్పటికీ పో లీసులు బీజేపీ కార్యకర్తలపై నాలుగు కేసులు నమోదు చేశారని తెలిపారు. బండి సంజయ్ స్పందించి రామగుండం సీపీతో మాట్లాడిన అనంతరం రాష్ట్ర డీజీపీతో మాట్లాడుతానని చెప్పినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment