శ్రీరాంపూర్: సింగరేణిలో ట్రేడ్స్‌మెన్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని గు ర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య తెలిపారు. సోమవారం సీసీసీ కార్నర్‌లోని నర్స య్య భవన్‌లో యూని యన్ ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రేడ్స్‌మెన్లు పొందుతున్న హక్కులన్నీ ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే వచ్చాయని అన్నారు. ట్రేడ్స్‌మెన్లు అన్‌ఫిట్ అయితే సర్ఫేస్‌లో సూట బుల్‌జాబ్ ఇవ్వాలన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్ ఏరియా ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీని ఎన్నుకున్నారు. బ్రాంచీ కార్యదర్శిగా ఎం.రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా నాగభూషణం, సహాయ కార్యదర్శిగా టీ.సురేశ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఆళ్ల వెంకట్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా రంగు రమేశ్, మల్లెత్తుల శ్రీనివాస్ ముత్యాల శ్రీనివాస్‌ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment