
వ్యవసాయ సాంకేతికత రైతులకు చేరాలి
బెల్లంపల్లి: వ్యవసాయ సాంకేతికతను ప్రతీ రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస ఇంచార్జి డాక్టర్ శ్రీలత అన్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం 8వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతులకు ఉపకరించే వ్యవసాయ విధానాలు, పంట సాగులో అధిక దిగుబడులు సాధించడం తదితర అంశాలపై చర్చించారు. కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోట శివకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు రవీందర్‌నాయక్, రాంప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, ఏడీవోలు కల్పన, శ్రీనివాసరావు, నాబార్డు డీడీఎం వీరభద్రం, లీడ్‌బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు, శాసీ్త్రయ సలహా మండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment