సమస్యలపై ఎంపీకి వినతి
జన్నారం: మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని మండల అభివృద్ధి కమిటీ నాయకులు ఆదిలాబా ద్ ఎంపీ నగేశ్‌ను కోరారు. మంగళవారం ఆదిలాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. టైగర్‌జోన్ నిబంధనల పేరుతో ఉన్న ఆంక్షల వల్ల మండల వాసులు ఇబ్బంది పడుతున్నారని, ఆంక్షలు సడలించాలని కోరారు. విద్యపరంగా అభివృద్ధికి జవహార్ నవోదయ విద్యాలయం జన్నారంలో ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. టైగర్‌జోన్ గుండా ప్రయాణానికి రహదారిపై ఫ్‌లై ఓవర్ వంతెనలు ఏర్పాటు చేయాలని, అడవిలో పశువుల మేతకు అనుమతి ఇచ్చేలా చూడాలని తెలిపారు. మండల కేంద్రంలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలుగా మార్చాలని కోరారు. కమిటీ కన్వీనర్ రామోజీ కొండయ్య, కోకన్వీనర్లు లక్ష్మీనారాయణ, చంద్రయ్య, రవి, సత్తన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment