పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిప ల్ కార్పొరేషన్‌లో ప న్ను వసూలు కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కమిషనర్ శివాజీ తెలిపారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు అందజేసి న మూడు రోజుల్లోపు పన్ను చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం కమిషనర్ తన కార్యాలయంలో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని పన్ను బకాయిదారులు సకాలంలో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని, మొండి బకాయిదారులు గడువులోపు పన్ను చెల్లించ ని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని తెలిపా రు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45,373 నివాస గృహాలు ఉండగా, రూ.26.28 కోట్లు పన్ను డిమాండ్‌కు రూ.10.61కోట్లు మాత్రమే వసూలైందని తెలిపారు. రూ.15.67కోట్లు బ కాయిలతోపాటు ట్రేడ్‌లైసెన్స్, నల్లా బిల్లు బ కాయిలు, షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు, ప్రకటనల పన్నులు రావాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment