పింఛన్ రాలేదు సారూ..!
నెన్నెల పోస్టాఫీస్ వద్ద వృద్ధులు
నెన్నెల: వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి నెల పింఛన్ ఇప్పటికీ అందకపోవడంతో వృద్ధులు పోస్టాఫీసుకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పింఛన్‌పై ఆధారపడిన వృద్ధులు మందులు, నిత్యావసరాల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ డబ్బులతోనే మందు గోలీలు కొనుక్కుంటానని, పానం బాగాలేదని, పింఛన్ సకాలంలో అందించాలని కోనంపేటకు చెందిన వృద్ధుడు నైతం బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యావసర సరుకులు కొనుక్కోలేక తిండికి తిప్పలవుతుందని నెన్నెలకు చెందిన వృద్ధురాలు రేవెల్లి సత్తమ్మ తెలిపింది. ఆరోగ్యం సహకరించకపోయినా పలువురు వృద్ధులు నెన్నెల పోస్టాఫీసు వద్ద మంగళవారం పింఛన్ కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. ఈ విషయమై నెన్నెల పోస్ట్‌మాస్టర్ రాజబాబును సంప్రదించగా.. బ్యాంకులకు నుంచి డబ్బులు రాలేదని, మూడు రోజుల్లో వస్తాయని, జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
పింఛన్ రాలేదు సారూ..!
Comments
Please login to add a commentAdd a comment