ప్రాథమిక విద్య భవిష్యత్‌కు పునాది
మంచిర్యాలఅర్బన్: ప్రాథమిక విద్య అనేది విద్యార్థి భవిష్యత్‌కు పునాది వంటిదని డీఈవో యాదయ్య అన్నారు. మంగళవారం జిల్లా సైన్స్ కేంద్రంలో 2024 డీఎస్సీలో ఎంపికై న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని అన్నారు. సమయపాలన, నిబద్ధతతో కూడిన పని విధానం, విద్యార్థులపై చూపే ప్రేమ, కరుణ మొదలైన విషయాలు ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో విలువను పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో డీఏవో తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను జిల్లా వ్యవసా య అధికారి(డీఏవో) కల్పన మంగళవారం తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగారు. వంటగదిలో భోజనం తయారీని పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఈ కీలక సమయంలో కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. పాఠశాల ప్రత్యేక అధికారి కనకలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment