పనిలో భద్రత అందరి బాధ్యత
జైపూర్: పనిలో భద్రత అందరి బాధ్యత అని, ప్రతీ ఉద్యోగి తన పనిలో, నిత్య జీవితంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎస్టీపీపీ ఇంచార్జి ఈడీ శ్రీనివాసులు అన్నారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో మంగళవారం 54వ జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించారు. రక్షణ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, ఉద్యోగులు భద్రతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, ఆ తర్వాతే ఉత్పత్తి, ఉత్పాదకత అన్నారు. ఉద్యోగిపై కుటుంబం ఆధారపడి జీవిస్తుందని, భద్రత విషయంలో అశ్రద్ధ చేయకుండా పని ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఓఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, పీఎంపీఎల్ ప్లాంట్ హెడ్ అఖిల్‌కపూర్, డీజీఎం పర్సనల్ అజ్మీరా తుకారం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment