పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేఖ వైఖరి వెల్లడైందన్నారు. దేశంలోని సామాన్య ప్రజలు, కార్మికులపై మోయలేని భారం మోపుతూ కార్పొరేట్లకు ఊడిగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు శారద, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంకె రవి, కార్యదర్శి అశోక్, నాయకులు లింగన్న, ప్రకాశ్, దూలం శ్రీనివాస్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment