ఆర్జీయూకేటీలో ‘కథక్’ శిబిరం
బాసర: స్పిక్ మేకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న కథక్ నృత్య శిబిరాన్ని మంగళవారం ఆర్జీయూకేటీలో ప్రారంభించారు. మార్చి 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కథక్ నృత్యకారిని శ్రీమతి ఆర్తి శంకర్, శ్రీమతి రచన విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న సాంస్కృతిక కళలను ఆర్జీయూకేటీ విద్యార్థులకు అందిస్తున్నందుకు అభినందించారు. శిబిరంలో శిక్షణ పొందిన 60 మంది విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సాక్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పిక్ మేకే హెరిటేజ్ క్లబ్ ఆర్జీయూకేటీ బాసర కోఆర్డినేటర్ డా.రాకేష్ రెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment