బాసరలో భారతీస్వామి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంగళవారం శ్రీచిదానంద ఆశ్ర మ భువనేశ్వరి విజయవాడ పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీస్వామి దర్శించుకున్నా రు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
తాండూర్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ట్రాలీని బోయపల్లి బోర్డు వద్ద తనిఖీ చేయగా 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. తాండూర్ మండలం తంగళ్లపల్లికి చెందిన దుర్గం శ్రీకాంత్, బుల్లి చందు, కునుగల తిరుపతిని అదుపులోకి తీసుకోగా గోవిందుల శ్రీనివాస్ పరారైనట్లు తెలిపారు.
చింతగూడ అడవిలో మంటలు
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చింతగూడ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కార్చిచ్చు అంటుకుంది. ప్రజలు గమనించి అటవీ శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. విషయం ఎస్పీ గౌస్ ఆలం దృష్టికి వెళ్లడంతో పోలీసులు, అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో గులాబ్‌సింగ్ మాట్లాడుతూ రాలిపోయిన ఆకులకు నిప్పంటుకోవడంతో సుమారు 4 నుంచి 5 హెక్టార్ల వరకు మంటలు చెలరేగడంతో సిబ్బందితో కలిసి ఆర్పివేశామన్నారు.
సింగరేణి పాఠశాలలో నాణ్యమైన విద్య
మందమర్రిరూరల్: సింగరేణి పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని సింగరేణి ఎడ్యుకేషన్ సెక్రెటరీ శ్రీనివాస్ అన్నారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థకు చెందిన పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పురుషోత్తం, సీసీసీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.
బాసరలో భారతీస్వామి పూజలు
Comments
Please login to add a commentAdd a comment