వివాహిత హత్య కేసులో భర్త అరెస్టు
పెంచికల్‌పేట్: మండలంలోని లోడుపల్లి గ్రామానికి చెందిన గుర్లె లలితను ఈ నెల 2న ఆదివారం ఆమె భర్త గణేశ్ హత్య చేసినట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ కొద్ది రోజులుగా గణేశ్ భార్యపైన అనుమానంతో వేధింపులకు
పాల్పడుతున్నాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన దంపతులు ఆదివారం గ్రామ సమీపంలోని పంట చేనులో గొడవపడ్డారు. భార్య ఎదురుతిరగడంతో కోపంతో చాతిపైన కొట్టడంతో లలిత కింద పడిపోయింది. వెంటనే తన మెడలో ఉన్న తువ్వాలు మొఖం మీద కప్పి ముక్కు, నోరు మూయడంతో ఊపిరాడక మృతి చెందింది. మృతురాలి తల్లి తానుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఎల్కపల్లి బస్టాండ్‌లో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన తువ్వాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సై కొమురయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment