శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గెజిటెడ్ నం.1 పాఠశాలలో డీఎస్సీ 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి జిల్లా పరిధిలోని 300 మంది ఎస్‌ఏలకు వృత్యంతర ప్రేరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పుస్తకాలను సమర్థవంతంగా ఉపయోగించి విద్యాబోధన చేయాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మంచి ఫలితాలు సాధించాలన్నారు. రూపకార, సమీకృత అంచనాలు, డిజిటల్ కాంటెంట్, ఎఫ్‌ఎల్‌ఎన్, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, యూడైస్ తదితర కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాల నం.2లో బయోసైన్స్, బాలక్ మందిర్‌లో గణితం, హింది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, గెజిటెడ్ నం.1లో సాంఘిక శాస్త్రం, సరస్వతినగర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు సుజాత్‌ఖాన్, నారాయణ, శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment