● ఆ అమ్మకు నీరాజనం ● ఏడుగురు కూతుళ్లు, కుమారుడు ● భర్త లేకున్నా అందరినీ సాకిన ఆదర్శమూర్తి ● కూలీ పని చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే8 కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొంకటి అనసూర్య ఆయాగా పని చేస్తోంది. ఆర్కే8 కాలనీలోనే నివాసం ఉంటోంది. ఆర్కే 6 గనిలో కోల్‌కట్టర్‌గా పని చేస్తూ భర్త వెంకటయ్య 30ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. వీరికి ఎనిమిది మంది సంతానం. కూతుళ్లు సంతోష, విజయ, స్వరూప, మాధవి, సంధ్య, రమా, స్వాతి, కుమారుడు రఘు ఉన్నారు. పిల్లలందరినీ ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివించింది. ఆ తర్వాత ప్రభుత్వ హాస్టళ్లలో ఎక్కడ సీటు వస్తే అక్కడ చేర్పించింది. ‘చదువు లేకుంటే కై కిలు పనికి పోవాల్సి వస్తుంది బిడ్డ..’ అని మంచి మాటలు చెబుతూ వారి ధ్యాసను చదువువైపు మళ్లించింది. భర్త ఉన్నప్పుడే పెద్ద కూతురు సంతోషకు పెళ్లి చేసింది. రెండో కూతురు విజయను పీజీ(ఎంఏ) వరకు చదివించగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. స్వరూపను పీజీ(ఎంఏ), మాధవి కూడా పీజీ(ఎంఎస్సీ, బీఈడీ) వరకు చదివించి పెళ్లి చేసింది. సంధ్య బీఎస్సీ నర్సింగ్ చేసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా, రమ్య బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సుగా చేస్తున్నారు. స్వాతి ఎంకాం, బీఈడీ చదివి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ గ్రూప్స్‌కు సిద్ధమవుతోంది. వీరందరికీ అనసూర్య పెళ్లి చేసింది. కుమారుడు రఘును సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చదివించగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
ఉన్నదాంట్లో పిల్లలను పెంచిన కూడా చదువులు, పెళ్లిళ్లకు అనసూర్యకు సుమా రు రూ.10 లక్షల వరకు అప్పు అయ్యింది. ఆడపిల్లలైనా చదువుకు లోటు రాకుండా చేసింది. తల్లి కష్టాన్ని చూసి కూతుళ్లు మిగతా చెల్లెళ్ల పెళ్లిళ్లకు చేతనైన సహా యాన్ని అందిస్తూ వచ్చారు. ఈ నెల 2న జరిగిన చివరి కూతురు పెళ్లి సమయానికి అక్కాచెల్లెళ్లు అంతా కలిసి తల్లి అప్పుల్లో కొంత తీర్చి శభాష్ అనిపించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం అనసూర్యను పాఠశాలలో ఉపాధ్యాయులు రమేశ్, సరిత శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఎదిగిన పిల్లలు ఆసరాగా..
Comments
Please login to add a commentAdd a comment