● బొగ్గు ఉత్పత్తిలోనూ మహిళల శ్రమ ● పురుషులకు సమంగా అతివ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/శ్రీరాంపూర్: బొగ్గు గని అంటే చీకటి గుహ. మగవాళ్లకే పరిమితమైన విధులను మహిళలు సైతం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ‘మీ రేం పని చేస్తారు’ అన్న ఎగతాళీ నోళ్లకు ముకుతాడు వేస్తూ మహిళలు తలచుకుంటే ఏ పనైనా చేయగలమని నిరూపించారు. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల కారణంగా మహిళల సంఖ్య 1995 మందికి చేరింది. గత కొంతకాలంగా భూగర్భంలోనూ పని చేస్తున్నారు. కంపెనీలో పని చేస్తున్న మహిళలపై కథనం..
కోర్టు తీర్పుతో హక్కులు..
బ్రిటీష్ కాలంలో పురుషులతోపాటు సమానంగా మహిళలు గనుల్లో పని చేసేవారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా జరిగినా, తిండి లేక చావడం కంటే పిడికెడు మెతుకుల కోసం పనులకు వచ్చేవారు. ఎక్కువగా వితంతువులే ఈ పనులకు వెళ్లేవారు. దేశ స్వాతంత్య్రం వచ్చాక మహిళలను గనుల్లో తీసుకోవడం నిలిపివేశారు. ప్రమాదవశాత్తు గనుల్లో కార్మికులు చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఉద్యోగం కల్పించే వారు. అది కూడా ఉపరితలంలోనే గుట్కాల షెడ్డులు, కార్యాలయాల్లో అటెండర్లుగా నియమించారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలనే ఓ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి.
అన్ని స్థాయిల్లో విధులు
కారుణ్య కోటాలో మొదట జనరల్ మజ్దూర్(ఫిమేల్)గా నియమిస్తూ ఆఫీసులు, సివిల్ డిపార్టుమెంట్లలో తేలిక పాటి పనులకు తీసుకునే వారు. వీరి సంఖ్య పెరగడంతో ఓసీపీలు, వర్క్‌షాప్‌లు, స్టోర్స్, సీహెచ్‌పీలతోపాటు భూగర్భ గనుల్లో కూడా దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓసీపీల్లో హెమ్ సెక్షన్‌లో పురుషులతోపాటు వీరు సమానంగా యంత్రాలను మరమ్మతు చేస్తున్నారు. సీనియర్ మహిళా కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. జనరల్ మజ్దూర్, జూనియ ర్ అసిస్టెంట్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, సబ్ ఓవర్‌సీస్ ట్రైనీ, స్టాఫ్‌నర్స్, క్లే పిల్ మజ్దూర్, స్వీపర్ బదిలీ వర్కర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అండర్ మేనేజర్లు, లా ఆఫీసర్స్ వంటి 27హోదాల్లో పని చేస్తున్నారు.
● బొగ్గు ఉత్పత్తిలోనూ మహిళల శ్రమ ● పురుషులకు సమంగా అతివ
Comments
Please login to add a commentAdd a comment