చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్ల అరెస్టు
● ఏడు బైక్‌లు స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేఽశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నిర్మల్ కేంద్రంగా ఉండే ఇద్దరు మైనర్లు ఆరు నెలలకోసారి ఆదిలాబాద్‌కు వస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. బైక్‌లతోపాటు నేరడిగొండ, ఇచ్చోడ ఆలయాల్లోనూ చోరీలు చేశారు. శనివారం ఉదయం లాండసాంగ్వీ ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. విచారించగా ఏడు బైక్‌లను దొంగలించినట్లుగా అంగీకరించారు. వారి వద్ద ఉన్న రెండు బైక్‌లు, ఏరోడ్రమ్‌లో ఉంచిన మరో ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గతంలో వీరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరితోపాటు పెన్‌చౌహాన్‌తో మరో మైనర్ బాలుడు కలిపి నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. వన్‌టౌన్ పరిధిలో ఐదు, టూటౌన్, మావల స్టేషన్ల పరిధిలో ఒక్కో బైక్‌ను దొంగలించినట్లుగా ఆయన వెల్లడించారు. చాకచక్యంగా వీరిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్‌రావు, ఫణీదర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment