రక్తహీనతతో బాలింత మృతి
ఉట్నూర్‌రూరల్: ఓ వైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో నెల రోజుల బాలింత రక్తహీనతతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన భగవంత్‌రావు– శ్రీవిద్య దంపతులు ఉపాధి నిమిత్తం ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీవిద్య నెలక్రితం రిమ్స్‌లో పాపకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో రక్తహీనతతో బాధపడగా చికిత్స అనంతరం ఆమెను ఇటీవల ఇంటికి పంపారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఆరోగ్యం క్షీణించి లక్కారంలో మృతి చెందింది. తల్లి మృతి అనంతరం పసికందు గుక్కపెట్టి ఏడుస్తున్న హృదయవిదారక దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. బాలింత మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పసికందుకు పాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు.
అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు
ఖలీల్‌వాడి: నిజామాబాద్, నిర్మల్, ఆదిలా బాద్ జిల్లాల్లో చైన్‌స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తెలి పారు. నిజామాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది డి సెంబర్ 12న బోర్గాం(పి)కి చెందిన దుమాల లక్ష్మిబాయి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు బైక్‌పై వచ్చి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు చె ప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టిందన్నారు. మహారాష్ట్రలోని ధ ర్మాబాద్‌కు చెందిన షేక్ ఇమాన్ అలియాస్ అ బ్బు, షేక్ అర్బాజ్ అలియాస్ మాయా నిర్మల్ జిల్లా బాసరలోని శారదానగర్‌లో నివసిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని మూడు గొలుసులు, బైక్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులపై నాల్గో టౌన్ పీఎస్, మాక్లూర్, నిర్మల్ జిల్లా బాసరలో చైన్ స్నాచింగ్‌లు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బైక్‌ల చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నాందేడ్ జిల్లాకు చెందిన మరో నిందితుడు అమన్ అలియాస్ అమన్‌పటేల్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment