ఖానాపూర్ అడవిలో కార్చిచ్చు
ఖానాపూర్: మండలంలోని సత్తన్‌పల్లి, అడవి సారంగాపూర్ తదితర గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చుతో దగ్ధమవుతోంది. పలుచోట్ల భారీ వృక్షాలు, కలప దుంగలు కాలిబూడిదవుతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే పలుచోట్ల మంటలు రాజేసుకున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంటలకు విలువైన టేకు కలప వృక్షాలు దగ్ధంతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ప్లాంటేషన్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. జంతువుల మనుగడకు సైతం కార్చిచ్చుతో ముప్పు వాటిల్లే అవకాశం నెలకొంది. రోడ్డు పక్కనే పరిస్థితి ఇలా ఉంటే, అడవి ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అడవిలో రాలిన ఆకును శుభ్రపర్చే సిబ్బంది ఉన్న నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో కిరణ్‌ను వివరణ కోరగా, సిబ్బందితో ఎప్పటికప్పుడు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment