నగదు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
సోన్: నగదు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి, సొమ్ము రికవరీ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సాకట్ యాదవ్ గత 12 ఏళ్లుగా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన సౌమ్య ఫెర్టిలైజర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షెటర్ తాళం పగులగొట్టి కౌంటర్‌లో రూ.96 వేలు దొంగతనం చేశాడు. శనివారం ఉదయం యజమాని గోల దయాసాగర్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఐదు గంటల్లో కేసును ఛేదించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేశారు. కేసు ఛేదించిన సోన్ సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు గోపి, శ్రీకాంత్, సిబ్బంది భీమన్న, ముజమిద్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment