కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కృషి
కాసిపేట: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం, హక్కుల సాధనకు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కృషి చేస్తుందని సంఘం బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ తెలిపారు. మందమర్రి ఏరియా కాసిపేట 1గనిపై శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. గుర్తింపుసంఘం ఏఐటీయూసీ, సీఅండ్‌ఎండీతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గని ఫిట్ కార్యదర్శి మినుగు లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నాయకులు తదితరులున్నారు.
బెల్లంపల్లి: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తమ సంఘం ముందంజలో ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు అన్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై శనివారం జరిగిన గేట్ మీటింగ్‌లో నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో సింగరేణి యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు తీవ్రంగా చర్చించి 14డిమాండ్‌లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడటానికి ఎర్రజెండా యూనియన్ ఎంతటి పోరాటాలకై న ముందుంటుందని ప్రకటించారు. సమావేశంలో శాంతిఖని గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరి మంతెన రమేష్, నాయకులు పి.రాజలింగు, మిట్టపల్లి రమేష్, ఆర్.ప్రవీణ్, దాడి రమేష్, సంతోష్‌కుమార్, రామకృష్ణ, ఫకృడా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment