టైర్ పేలి లారీబోల్తా
గుడిహత్నూర్: లారీ టైర్ పేలి బోల్తాపడిన ఘటన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన లారీ దుస్తుల లోడ్‌తో వెళ్తోంది. మార్గమధ్యలో ఒక్కసారిగా టైరు పేలి పక్కనే నిలిచి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టి అండర్‌మ్యాన్ పాస్ వద్ద రోడ్డుపై పడింది. దీంతో క్యాబిన్ నుజ్జునుజ్జుయింది. అటు నుంచి వెళ్తున్న పలువురు, ఎన్‌పీడీసీఎల్ హెల్పర్ హన్మంతు, మధ్యప్రదేశ్‌కు చెందిన దుస్తుల వ్యాపారి వేర్వేరు బైక్‌లపై వస్తున్నారు. దుస్తుల వ్యాపారి బైక్‌పై పైనుంచి టైర్లు పడడంతో వాహనం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన క్షణంలో హెల్పర్ బైక్‌పై పడ్డ రివిట్‌మెంట్ బండలతో వాహనం దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నుజ్జునుజ్జుయిన క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ మురుగేశన్ (49) బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
ఈ ఘటన శుక్రవారం జరిగి ఉంటే పెను ప్రమాదంగా మారేది. అంగడి బజార్ సంత వల్ల ఈ ప్రాంతమంతా కిక్కిరిసిన జనాలతో ఉండేది. ఈ ప్ర మాదం జరిగి ఉంటే పదుల సంఖ్యలో మృతి చెందేవారు. జాతీయ రహదారి నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై నిత్యావసరాల కోసం లారీలను నిలపడం సైతం ఒక కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుడిహత్నూర్‌లో ఘటన
డ్రైవర్ మృతి
టైర్ పేలి లారీబోల్తా
టైర్ పేలి లారీబోల్తా
Comments
Please login to add a commentAdd a comment