సమానత్వం చూపెట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులకంటే మిన్నగా రాణిస్తారు. ఏ పని అప్పగించిన నిజాయతీగా, అంకితభావంతో పని చేస్తారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. కంపెనీ వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆరు నెలలు మెటర్నిటి, పిల్లలకు 18ఏళ్లు వచ్చే లోపు 2ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు ఉన్నాయి. ఎవరైనా వేధింపులకు గురైతే ఏరియా ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మహిళల సంరక్షణకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది. – ఎస్.శిరీషారెడ్డి, డీజీఎం(లాఆఫీసర్), శ్రీరాంపూర్
Comments
Please login to add a commentAdd a comment