● జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక ● రాళ్లవా
తొలగనున్న కాజ్‌వే కష్టాలు
ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రాళ్లవాగుపై గతంలో ఉన్న కాజ్‌వేను తొలగించి బ్రిడ్జిని నిర్మించేందుకు 2024 మార్చి 10న స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు భూమిపూజ చేశారు. ఏటా కాజ్‌వే రాళ్లవాగు ఉధృతికి కొట్టుకుపోతోంది. వర్షాకాలం ముగిసిన తర్వాత మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైలెవల్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. కాజ్‌వే స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీ, పవర్‌సిటీ కాలనీ ప్రజలు డిమాండ్ చేయడంతో గతేడాది మార్చిలో బ్రిడ్జిని నిర్మించేందుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమిపూజ చేశారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం కావడం, ఈ మార్గం గుండా ఆరులేన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో, బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం అయింది.
మంచిర్యాలటౌన్: పల్లె, పట్టణ అభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన రవాణా సౌకర్యం ఉంటే మారుమూల ప్రాంతాలు కూడా వేగంగా అభిృద్ధి చెందుతాయి. అందుకే ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి తాజాగా మంచిర్యాల నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ బండలంలోని 8 గ్రామాలను కలిపి ప్రభుత్వం మంచిర్యాల కార్పొరేషన్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి తగిన విధంగా రహదారుల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయించారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఈనెల 6న మంచిర్యాల అభివృద్ధికి రూ.199 కోట్లు కేటాయిస్తూ జీవో 99 విడుదల చేశారు. ఈ నిధులతో మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారులను ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. నిధులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించడమే తరువాయి. రోడ్ల విస్తరణకు సంబంధించి ఆర్‌అండ్‌బీ అధికారులు ఇటీవలే మార్కింగ్ చేశారు. ఆక్రమణలు తొలగించి రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు.
జాతీయ రహదారికి అనుసంధానంగా
మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్ర వరకు ఉన్న జాతీయ రహదారికి జిల్లా కేంద్రంలోని రోడ్లను అనుసంధానించనున్నారు. ఈమేరకు ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఈ మార్గంలోనే ఉన్న లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి రాళ్లవాగు మీదుగా ప్రస్తుతం ఉన్న కాజ్‌వే స్థానంలో హైలెవల్ వంతెనను నిర్మిస్తారు. ఈ రోడ్డును పాతమంచిర్యాల–ఆండాళమ్మ కాలనీ రోడ్డును విస్తరించి, పాతమంచిర్యాల స్టేజి వద్ద ఎన్‌హెచ్ 63కు అనుసంధానిస్తారు. దీంతో ప్రస్తుతం లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల మీదుగా ఆసిఫాబాద్‌వైపు వెళ్లే వాహనాలు, ఆసిఫాబాద్‌వైపు నుంచి మంచిర్యాల మీదుగా లక్సెట్టిపేట్ వైపు వెళ్లే వాహనాలకు ప్రస్తుతం లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి వైశ్యభవన్ వరకు ఉన్న బైపాస్ రోడ్డు అనుకూలంగా లేదు. రెండు వాహనాలు ఒకేసారి వెళ్లలేనంత ఇరుకుగా ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణతో పాతమంచిర్యాల మీదుగా లక్సెట్టిపేట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. ఆరు లైన్లుగా విస్తరించనుండడంతో ఒకేసారి మూడు వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. రోడ్ల విస్తరణతో భారీ వాహనాలతోపాటు, పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. మంచిర్యాల పట్టణం నుంచి ఎటు వైపు వెళ్లినా జాతీయ రహదారులకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.
● జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక ● రాళ్లవా
Comments
Please login to add a commentAdd a comment