కవులు, కళాకారులకు పుట్టినిల్లు
చెన్నూర్: కవులు, కళాకారులకు చెన్నూర్ పుట్టినిల్లని డాక్టర్ దేవరాజు రాంబావు అన్నారు. స్థానిక అన్నపూర్ణ అంజుమన్ సాంబయ్య మ హావాది స్మారక భవనంలో మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సీతా చరి తము, రుక్మిణి కళ్యాణం పుస్తకాలను అదివా రం ఆవిష్కరించారు. సమావేశంలో రాంబావు మాట్లాడుతూ కవి రచయిత వానమామలై వ రదాచార్యులు నడియాడిన గడ్డపై ఎందరో రచయితలు వివిధ రకాల రచనలు చేశారని గుర్తు చేశారు. అనంతరం రచయిత కొమ్మెర రాజేశ్వర్‌రావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో కాకిరాల పద్మకర్‌రావు, సురేశ్‌బాబు, పనకంటి రామ్మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment