సర్వేకు సిద్ధం
● నేటి నుంచి 50 పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే ● విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఆరా..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో భాష, గణిత సామర్థ్యాలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని తెలంగాణ విద్య పరిశోధన శిక్షణ మండలి నిర్ణయించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈనెల 10 నుంచి 12 వతేదీ వరకు రెండో తరగతి చదువుతున్న బాలబా లికలకు ఆయా అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ప్రా థమికస్థాయి విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ–భాష, గణిత భావనలు ఏమేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకుంటారు. చదవడం, రా యడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయటం తదితర అంశాలపై సర్వే నిర్వహించేందుకు ప్రశ్నపత్రాన్ని రూపొందించింది. విద్యార్థులు తెలుగు, ఆంగ్లం అక్షరాలను గుర్తిస్తున్నారా?, గణితంపై ఎంపిక చేసిన పాఠశాలల్లో సర్వే నిర్వహించనున్నారు.
50 పాఠశాలల్లో సర్వే..
జిల్లాలో 50 పాఠశాలల్లో సర్వే కొనసాగనుంది. 55 మంది డిగ్రీ విద్యార్థులు, సీఆర్పీలతో సర్వే నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండో తరగతికి చెందిన 8 మంది విద్యార్థుల చొప్పున స ర్వే చేయనున్నారు. ఇందులో ఫీల్డు ఇన్వెస్టిగేటర్లను నియమించారు. పాఠశాలకు వెళ్లి ఈనెల 10న తెలుగు, 11న గణితం, 12న ఆంగ్లం సబ్జెక్టులపై సు మారు 26 ప్రశ్నలతో సర్వే చేయనున్నారు. ఈ వివరాలన్నీ టాంజరిన్ యాప్‌లో నమోదు చేస్తారు.
రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ..
ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమ నిర్వహణపై జిల్లాలో ఉపాధ్యాయులకు మూడు రోజుల చొప్పున ఆరుగురు రిసోర్స్ పర్సన్‌లు శిక్షణ ఇచ్చారు. ఆయా మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కార్యక్రమం అమలుపై 108 మంది ఆర్పీలు అవగాహన కల్పించారు. వీరికి మూడు రోజుల క్రితం ఒక్కొక్కరికి రూ.400 చొప్పున భత్యం మంజూరు చేశారు. జిల్లాకు చెందిన రిసోర్స్ పర్సన్‌లకు రూ.97,200 నిధులు రాగా ఖాతాలో జమచేశారు.
ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలు ఇవీ..
ఎఫ్‌ఎల్‌ఎన్‌తో బడుల్లో చిన్నారులు కనీస సామర్థ్యాలతోపాటు తరగతి అభ్యసన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యం పెట్టుకుంది. ఇందుకు ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వీరందరూ సంబంధిత పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించటం.. సామర్థ్యాలు పెంపునకు విద్యార్థులకు అభ్యసన పుస్తకాలు విడతల వారీగా పంపిణీ చేసింది. నిర్దేశించిన సామర్థ్యాల కార్యక్రమం అమలుకు మండలానికి నోడల్ అధికారిని ఎంపిక చేశారు. ఎంఎన్‌వోల పర్యవేక్షణలో ఉపాధ్యాయుల ద్వారా చదవటం, రాయటం పూర్తిస్థాయిలో అందించాలనేదే ముఖ్య ఉద్దేశం.
పకడ్బందీగా సర్వే...
సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తాం. భవిష్యత్ కార్యాచరణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఎంఈవోల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరూ సర్వేలో భాగస్వాములవుతారు.
– యాదయ్య, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment