నూతన బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలి
● డిప్యూటీ సీఎంకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి
శ్రీరాంపూర్: సింగరేణికి నూతన గనులను కేటా యించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతి నిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్‌లో భట్టి నివాసంలో ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థకు భవిష్యత్ ఉంటుందన్నారు. సత్తుపల్లి ఓసీపీ 3, ఇల్లెందు ఓసీపీ 3తోపాటు గతంలో అనుమతి ఇచ్చిన తాడిచర్ల గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. వీటిలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీవీకే ఓసీపీ, కేటీకే ఓసీపీ, ఇల్లెందు ఓసీపీలలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో కాకుండా సింగరేణి కార్మికులతో చేపట్టాలని కోరారు. తమ విన్నపాలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీకి చెందిన మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, సారయ్య, వైవీ.రావు, మడ్డి ఎల్లయ్య, షేక్ బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య శంకర్‌రావు, వికాస్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment