వార్షిక ఉత్పత్తి సాధించిన ‘ఆర్కేన్యూటెక్’
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 18 రోజుల ముందే సాధించింది. మార్చి 31 నాటికి గని వార్షిక ఉత్పత్తిలక్ష్యం 1.6 లక్షల టన్నులు సాధించాల్సి ఉండగా ఆదివారం నాటికే సాధించిందని గని మేనేజర్ స్వామి రాజు తెలిపారు. ఉత్పత్తితోపాటు ఉ త్పాదకతలో 1.28 ఓఎంఎస్ సాధించినట్లు పే ర్కొన్నారు. 18 రోజుల ముందే వార్షిక ఉత్పత్తి ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశా రు. ఇందుకు కృష చేసిన ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, అధికారులను ఆయన అభినందించా రు. ఈ గనిలో 1983లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ఇంకా రెండేళ్ల జీవితకాలం ఉందని తెలిపారు. అండర్ గ్రౌండ్‌మైనింగ్‌లో ఈ గని జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ నమోదు చేసుకుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment