భవితకు భరోసా..!
● ఆటాపాటలతో విద్యాబోధన ● ఉమ్మడి జిల్లాలో 17 కేంద్రాలకు నిధులు ● ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు విడుదల
మంచిర్యాలఅర్బన్: ప్రత్యేకావసరాలు కలిగిన పిల్ల లకు ఆటపాటలతో విద్య అందించేందుకు ప్రభుత్వం భవితకేంద్రాలు ఏర్పాటు చేసింది. 21 రకాల వైకల్యాలతో బాధపడే పిల్లలను గుర్తించి సేవలందించేందుకు 2010లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు వారికి భరోసా ఇస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించడం, మాట్లాడడం, నడిపించడం కోసం నిపుణులను నియమించారు. ఉమ్మడి జిల్లాల వారీగా మండలానికో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సొంత భవనాలు ఉన్న వాటికి రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్‌తోపాటు జూన్ 20 నుంచి సంవత్సరం వరకు బాలికలకు స్టైఫండ్, రీడర్ అలవెన్స్ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొనుగోలు చేయాల్సినవి..
సులభంగా అర్థమయ్యేలా బోధన పరికరాలు, ఐఆర్పీలకు కుర్చీలు, బాస్కెట్‌బాల్, డంబుల్స్, రౌండ్ టేబుల్, అల్మారాలు, గ్రీన్ బోర్డు మ్యాగ్నిట్, వైల్డ్ ఎనిమాల్స్, ఫ్రూట్స్, టెడ్డీ రింగ్స్, గ్రీన్‌బోర్డు, బెడ్‌షీట్, సాండ్ బ్యాగ్, వాకింగ్‌బోర్డు, ప్లాస్టిక్ బాల్స్ తదితర 115 రకాల పిల్లలకు అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, భవిత కేంద్రాలకు అనుసంధానంగా ఉన్నత పాఠశాల ప్రఽధానోపాధ్యాయుల కమిటీ నేతృత్వంలో వీటిని సమకూర్చనున్నారు.
నిధులు మంజూరు..
ఉమ్మడి జిల్లాలోని పక్కా భవనాలు ఉన్న భవిత కేంద్రాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు కేంద్రాలు, కుమురం భీం జిల్లాలో నాలుగు, నిర్మల్‌లో నాలుగు కేంద్రాలకు రూ.8 లక్షల చొప్పున, మంచిర్యాలలో ఐదు కేంద్రాలకు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్, ఇచ్చోడ, జైనథ్, ఉ ట్నూర్, జైనూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ), జన్కపూర్, బెల్లంపల్లి, దండేపల్లి, కోటపల్లి, మందమర్రి తాండూర్, భైంసా, ముథోల్, నిర్మల్, ఖానాపూర్ కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి.
గతేడాది జూన్ నుంచి జవనరి వరకు..
భవిత కేంద్రాలకు వచ్చి వెళ్లే ప్రత్యేక అవసరాలు క లిగిన పిల్లలకు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, బాలికలకు స్టైఫండ్, రీడర్ అలవెన్స్ నిధులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 8 నెలల వర కు నిధులు మంజూరు చేశారు. మొత్తం ఆదిలాబాద్‌లో రూ.9,05,400, కుమరంభీం జిల్లాలో రూ. 7,80,480, మంచిర్యాలలో రూ. 8,26,800, నిర్మల్‌లో రూ.13,59120 నిధులు మంజూరయ్యాయి.
రవాణా భత్యం ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలో 92 మంది సీడబ్ల్యూఎస్‌ఎన్ పి ల్లలకు రూ.3.68 లక్షలు, మంచిర్యాలలో 93 మంది కి రూ.3.72 లక్షలు, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 92 మందికి రూ.3.92 లక్షలు, నిర్మల్‌లో 116 పిల ్ల లకు రూ.46,400 రవాణా భత్యం విడుదల చేశారు.
ఎస్కార్ట్ నిధులు..
సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలను భవిత కేంద్రాలకు తీసుకువచ్చేందుకు రూ.500 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్‌లో 40 మందికి రూ.1.60 లక్షలు, ఆసిఫాబాద్‌కు 68 మందికి రూ.2.72 లక్షలు, మంచిర్యాలలో 43 మందికి రూ.1.72 లక్షలు, నిర్మల్‌లో 121 మందికి రూ.4.81 లక్షల నిధులు మంజూరయ్యాయి.
స్టైఫండ్ నిధులు..
సీడబ్ల్యూఎస్‌ఎన్ బాలికలకు రూ.200 చొప్పున స్టై ఫండ్ నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జి ల్లాలో 224 మందికి రూ.3,58,200, కుమురంభీంలో 152 మందికి రూ.2,43,200, మంచిర్యాలలో 168 మందికి రూ. 2,68,400, నిర్మల్‌లో 246 మందికి రూ.3,93,000 నిధులు మంజూరు చేశారు.
రీడర్ నిధులు..
సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలకు రీడర్ అలవెన్స్ మంజూరయ్యాయి. ఒక్కొక్కరికి రూ.60 చొప్పున మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40 మందికి రూ.19,200, కుమురంభీంలో 36 మందికి రూ.17,280, మంచిర్యాలలో 30 మందికి రూ.14,400, నిర్మల్‌లో 44 మందికి రూ.21,120 నిధులు మంజూరయ్యాయి.
చర్యలు తీసుకుంటున్నాం
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నిధులు మంజూరయ్యాయి. ఆటపాటలతో విద్యాబోధ న సాగనుంది. భవిత కేంద్రంలో విద్యార్థుల అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment