
నేత్రదానంతో ఇద్దరికి చూపు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని మొదటి జోన్‌కు చెందిన జీదుల రాయమల్లు అ నారోగ్యంతో గురువారం మృతి చెందాడు. ఆ యన బతికి ఉండగానే తన మరణానంతరం కళ్లు దానం చేయాలని కుమారుడు దామోదర్‌కు చె ప్పేవాడు. రాయమల్లు మరణంతో దామోదర్ (ప్రభుత్వ ఉపాద్యాయుడు) తండ్రి కోరిక మేరకు ఎల్వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించాడు. వైద్యుడు కిషోర్ నేతృత్వంలో ఎంజీఎం వైద్యులు ప్రదీప్ రాయమల్లు ఇంటి కి చేరుకుని నేత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రా యమల్లు రెటీనాలతో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపా రు. కార్యక్రమంలో సోపతి వెల్ఫే ర్ సొసైటీ అధ్యక్షుడు భీమ్‌పుత్ర శ్రీనివాస్, రహీమ్ బ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు రహీం, అవయవ దాతలు, శరీర దాతల సంఘం సభ్యులు బాబ్జీ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment