విద్యుత్ సబ్‌స్టేషన్‌కు పవర్ ట్రాన్స్‌ఫార్మర్
భీమారం: మండలంలోని గ్రామాల్లో వేసవిలో లో ఓల్టేజీ సమస్యరాకుండా ఉండేందుకు విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచి 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు శుక్రవారం తెప్పించారు. ఇప్పటి వరకు ఉన్న 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో వీటిని బిగించనున్నట్లు ఏఈ శంకర్ తెలిపారు. వేసవిలో గృహ అవసరాలతోపాటు వ్యవసాయరంగానికి కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ముందస్తుగానే పీటీఆర్ సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. శనివారం సబ్‌స్టేషన్‌లో బిగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment