‘బోరు’మంటున్నారు
● 30 ఏళ్లుగా పనిచేసిన బోర్ మెకానిక్‌లు ● గత ప్రభుత్వం తొలగించడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ● ప్రభుత్వం స్పందించి అదుకోవాలని వేడుకోలు
చెన్నూర్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చెడిపోయిన చేతిపంపులకు మరమ్మతులు చేస్తూ ఉపాధి పొందిన బోర్ మెకానిక్‌ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. గత ప్రభుత్వం మెకానిక్‌లను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయి. 1994 నుంచి 2021 వరకు 27 ఏళ్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధీనంలో పని చేశా రు. 2004లో మెకానిక్‌లను అప్పటి ప్రభుత్వం మండల పరిషత్ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీరిని తొలగించింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 22 మంది, రాష్ట్రంలో 337 మంది బోర్ మెకానిక్‌లు పనిచేశారు. రూ.15 వేల చాలీచాలని వేతనంతో 27 ఏళ్లు సేవలు అందించారు. మిషన్ భగీరథ పథకం రావడంతో 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలగించింది. కాంట్రాక్టు ఉద్యోగులుగా 27 ఏళ్లు పనిచేసివారిని క్రమబద్ధీకరించకపోగా, ఉన్న ఉద్యోగాల నుంచి తొలగించింది. అప్పటి నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని నాలుగేళ్లుగా ఆందోళనలు, ఉద్యమాలు చేసినా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు, స్థానిక ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి చొరవతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మిషన్‌భగీరథ(ఈఎన్‌సీ)ఇంట్రా డిపార్టుమెంట్‌కు అప్పగించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
అవస్థలు పడుతున్నాం ఆదుకోండి..
28 ఏళ్లు పని చేశాం. నాలుగేళ్ల నుంచి పనులు లేక అవస్థలు పడుతున్నాం. పలు మార్లు మంత్రులు, ముఖ్య మంత్రిని కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. సీఎం సార్ మా బాధలను పట్టించుకుని మమ్ముల్ని అదుకోవాలి. మిషన్ భగీరథ పధకంలలో మమ్ముల్ని తీసుకుని ఉపాధి కల్పించాలి. – డొబ్బాల శంకర్,
బోర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
‘బోరు’మంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment