రూ.21 లక్షలు పలికిన స్విమ్మింగ్‌పూల్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల స్విమ్మింగ్‌పూల్‌కు రికార్డుస్థాయి ధర పలికింది. గురువారం ఖరారు చేసిన టెండర్లలో ఆదిలాబాద్ పట్టణం దుర్గానగర్‌కు చెందిన జబాడే రాష్ట్రపాల్ అత్యధికంగా రూ.21లక్షలు బిడ్ దాఖలు చేసి దక్కించుకున్నారు. 2025–26 సంవత్సరానికి గానూ స్విమ్మింగ్‌పూల్ నిర్వహణకు ఈ నెల 15 వరకు మున్సిపల్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఆఫ్‌లైన్‌లో ఆరుగురు కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేయగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సీవీఎన్. రాజు ఆధ్వర్యంలో రూ.10,89,500 ప్రారంభ ధరతో టెండర్లు ఆహ్వానించగా రాష్ట్రాపాల్ అనే కాంట్రాక్టర్ అత్యధికంగా రూ.21లక్షలు కోట్ చేశారు. రెండోస్థానంలో ప్రఽశాంత్ అనే కాంట్రాక్టర్ రూ.16.20 లక్షలు బిడ్ చేశాడు. అత్యధిక ధరకు కోట్ చేసిన వ్యక్తికి స్విమ్మింగ్‌పూల్‌ను అప్పగిస్తూ టెండర్ ఖరారు చేశారు. నివేదికను కలెక్టర్ రాజర్షిషాకు పంపించి త్వరలోనే నూతన కాంట్రాక్టర్‌కు స్విమ్మింగ్‌పూల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం సూపరింటెండెంట్ రఫీ, మసూద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment