రోడ్ల వెంట మొక్కల పెంపకం
● అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్
తాంసి: హరితనిధిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు రోడ్ల వెంట పచ్చదనం పెంచేందుకు మొక్కల పెంపకం చేపడుతున్నట్లు అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్ తెలిపారు. తాంసి అటవీశాఖ సెక్షన్ పరిధిలో అంతరాష్ట్ర రోడ్డుకు ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్ తనిఖీ చేశారు. మండలంలోని హస్నాపూర్ వద్ద నాటిన మొక్కలను డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి పరిశీలించారు. నాటిన మొక్కల వివరాలు, పెంపకం, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శరవణన్ మాట్లాడుతూ హరిత నిధిలో భాగంగా జిల్లాలో 87 కి.మీ మేర రోడ్లు ఇరువైపులా మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేశామన్నారు. రేంజ్ అఫీసర్ గులాబ్, సెక్షన్ అధికారి అహ్మద్ ఖాన్,బీట్ ఆఫీసర్ సాయికుమార్ ఉన్నారు.
నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలి
తలమడుగు: అంతర్రాష్ట్ర రహదారి ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని అటవీ శాఖ సీసీఎఫ్ శరవణన్ అన్నారు. మండలంలోని సుంకిడి, లింగి, కుచులాపూర్, లక్ష్మింపూర్ గ్రామాల్లోని అంతర్రాష్ట్ర రహదారి ఇరువైపులా నాటిన మొక్కలను బుధవారం పరిశీలించారు. ఆంతర్రాష్ట్ర రహదారి పొడువునాటిన మొక్కలు వేసవిలో ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. మొక్కలను పశువులు తినకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం లింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీఆర్‌ఓ ప్రమోద్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment