ఆర్జీయూకేటీ వీసీకి అరుదైన గౌరవం
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విధులు నిర్వహిస్తున్న వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌కు బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్‌లో అరుదైన గౌరవం దక్కింది. తాజా ఎడిషన్–140ని వెల్లడించగా.. అందులో భారతదేశ భవిష్యత్‌ను రూపొందించడంలో నాణ్యమైన విద్య, ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాముఖ్యతపై ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్‌కు ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్, అసోసియేట్ డీన్స్ డాక్టర్ విఠల్, విభాగాల అధిపతులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
అధ్యాపకులతో వీసీ సమీక్ష
ఆర్జీయూకేటీ అధ్యాపకులతో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షతన బుధ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ నాక్ అక్రిడిటేషన్‌తో నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇన్‌స్టిట్యూషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐయూఏసీ), సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ (ఎస్‌ఎస్‌ఆర్), వర్క్‌షాప్‌లు, సెమినార్లు, సమావేశాలు, అధ్యాపక విజయాలు, ప్రాజెక్ట్ వర్క్‌లను సమన్వయం చేయాలన్నారు. టెక్ ఫెస్ట్, స్పోర్ట్స్ డే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో అధ్యాపకులు, కన్వీనర్లు సహకారం అందించారన్నారు. సమావేశంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్, ఎవో రణధీర్, అసోసియేట్ డీన్‌లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment