అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్/మందమర్రిరూరల్: మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పళ్లెం రాజలింగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. గోవాలో ఇటీవల జరిగిన 47వ యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. 75 సంవత్సరాల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో వరంగల్ క్రీడాకారుడు నర్సయ్యతో కలిసి పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న రాజలింగును బుధవారం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, జాయింట్ సెక్రటరీ రమేశ్ రెడ్డి, అడ్వైజర్ కృష్ణ, సీనియర్ క్రీడాకారుడు మురళీ అభినందించారు. ఈ సందర్భంగా రాజలింగు మాట్లాడుతూ ఽథాయిలాండ్‌లో నిర్వహించే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యానని తెలిపారు. గతంలో రెండుసార్లు ఈ పోటీలకు ఎంపికయ్యానని ఆర్థిక స్థోమత లేక పోటీల్లో పాల్గొనలేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే రాష్ట్రం నుంచి పతకం సాధిస్తాననిఽ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment