కార్మికులపై వేధింపులు మానుకోవాలి
● హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
జైపూర్(చెన్నూర్): అధికారులు కార్మికులపై వేధింపులు మానుకోవాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. జైపూర్ మండలం ఇందారం ఐకే1ఏ గనిని సెంట్రల్ కమిటీ సభ్యులు తిప్పారపు సారయ్యతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బెదిరింపు లెటర్లు, చార్జీషీట్లు ఇస్తూ కొంతమంది అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వేతనంలో కోత విధిస్తున్నారని, సమస్యల మీద ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మికులు తెలపగా అధికారులపై మండిపడ్డారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై దృష్టి సారించడంతో పాటు రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు అశోక్, కొమురయ్య, సాయికుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment