● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డితో సోమవారం ట్రాఫిక్ అవగాహనతో కూడిన ప్లెక్సీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. పట్టణంలో సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడానికి ప్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు పోతారం శ్రీనివాస్, సీహెచ్.నాగేందర్ పాల్గొన్నారు.